అక్షయ్ మినహా సినిమాలో ఏం లేదంటున్నారే..?

ఓటీటీలో మాంచి మాస్ సినిమా పడలేదని ప్రేక్షకులంతా ఎదురుచూసారు. అక్షయ్ కుమార్ లక్ష్మీ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసినప్పటి నుండి మాస్ జనాలకి కావాల్సిన సినిమా వచ్చేస్తోందని భావించారు. మరి లక్ష్మీ సినిమా మాస్ జనాలని ఆకట్టుకుందా అంటే, లేదనే అర్థం అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజై సూపర్ సక్సెస్ అందుకున్న కాంచన సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన లక్ష్మీ సినిమా బాలీవుడ్ జనాలని ఆకట్టుకోలేదని తెలుస్తుంది.

డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజైన లక్ష్మీ సినిమాలో అక్షయ్ కుమార్ మినహా, సినిమా అంతా అర్థం పర్థం లేని డ్రామాతో సాగిందని,, విలనిజం కూడా పెద్దగా పండలేదని, ఒరిజినల్ సీన్లని వదిలేసి, బాలీవుడ్ అనగానే కొత్త వాటితో నింపేయడమే దీనికి కారణమని, అందువల్లే హార్రర్ కూడా అంతగా వర్కౌట్ కాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మాస్ జనాలకి నిరాశే ఎదురయ్యిందన్నమాట.