బాల‌య్యఆస్ప‌త్రికి భారీ విరాళం

-

ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు గోపీచంద్ ఇన్నమూరి, వెంకట్ ఉప్పుటూరి వారి కుటుంబసభ్యులతో కలిసి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు 14,48,700/- రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. ఇవాళ వీరు బాల‌య్య‌ను క‌లిసి ఆస్ప‌త్రి సంద‌ర్శించాక, తమ దాతృత్వం చాటుకున్నారు.

క్యాన్సర్ మ‌హమ్మారిపై ఏళ్ల త‌ర‌బ‌డి మా ఆస్ప‌త్రి బృందం చేస్తున్న పోరాటం అనిర్వ‌చ‌నీయ‌మ‌ని, ఈ క్ర‌మంలో ఇటువంటి దాతల సహాయసహకారాలే మాకు కొండంత బలం అని ఈ సంద‌ర్భంగా బాల‌య్య వ్యాఖ్యానించారు.”నిరుపేద క్యాన్సర్ రోగులకు సహాయం చేయడంలో మీ నిబద్ధతను నేను నిజంగా అభినందిస్తున్నాను..మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..”అని అన్నారాయన.

Read more RELATED
Recommended to you

Latest news