నాని 28వ చిత్రం.. ప్రకటన వచ్చేసిందోచ్..

నేచురల్ స్టార్ నాని కెరీర్లో 28వ చిత్రం ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్లో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని ప్రకటించారు. దీపావళి కానుకగా శుభాకాంక్షలు చెబుతూ సినిమా ప్రకటన ఇచ్చారు. ఈ సినిమాతో హీరోయిన్ నజ్రియా ఫాహద్ ని తెలుగులో పరిచయం చేయబోతున్నారు. తమిళ చిత్రమైన రాజా రాణీలో కనిపించిన నజ్రియా దాని తెలుగు అనువాదం ద్వారా తెలుగు వారికీ పరిచితమే.

కానీ మొదటి సారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతుంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హృదయానికి హత్తుకునే చిత్రాలని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ, నానితో సినిమా చేస్తున్నాడంటే మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుందని అర్థం అవుతుంది. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని ప్రకటిస్తారట. ఆ లోగా దీపావళి శుభాకాంక్షలతో ముగిస్తున్నామని తెలిపారు.