సాహో చాప్టర్ 2 వచ్చేస్తుంది..!

-

రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి షేడ్స్ ఆఫ్ చాప్టర్ 1 గా అప్పట్లో ఓ మేకింగ్ వీడియో హంగామా చేసింది. ఇక ఇప్పుడు సాహో నుండి సెకండ్ మేకింగ్ వీడియో రాబోతుందని తెలుస్తుంది. మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో 2 రిలీజ్ చేస్తున్నారట.

శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత చేస్తున్న ఈ సాహో మీద కూడా తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news