జెర్సీ కోసం నాని రిస్క్

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కోసం నాని రెమ్యునరేషన్ త్యాగం చేశాడని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని జెర్సీ సినిమా కోసం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్ణయిచుకున్నాడట. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే కథ బాగా రావడంతో ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దని చెప్పాడట.

అందుకే తన రెమ్యునరేషన్ కూడా త్యాగం చేశాడట. సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయితే అప్పుడు లాభాల్లో వాటా కావాలని అంటున్నాడట నాని. నిర్మాతలు అందుకు సరే అనడంతో ఢీల్ కుదిరిందట. ఒకవేళ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకుండా లాభాలు రాకున్నా నిర్మాతలతో మరో సినిమా చేసి పెడతానని మాట ఇచ్చాడట నాని.

జెర్సీ కోసం నాని రిస్క్ చూస్తుంటే సినిమా కథ ఎంత బాగా వచ్చిందో అర్ధమవుతుంది. మరి నాని రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్న ఈ జెర్సీ అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news