సాలీడులను చంపబోయి ఇల్లునే తగులబెట్టాడు..!

-

వీడేం మనిషిరా బాబోయ్.. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అనుకుంటా. అందుకే సాలీడులను చంపబోయి ఇంటినే కాల్చేశాడు. ఈ ఘటన యూఎస్ లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఇల్లునే తగులబెట్టిన ఆ యువకుడిపై తెగ ఫైరయిపోతున్నారు.

ఓ యువకుడు.. వయసు 23 ఏళ్లు. తన పేరెంట్స్ ఇంటికి వెళ్లాడట. వెళ్లాక.. ఇంట్లో కిటికీ దగ్గర సాలీడుల గుంపును చూశాడట. వామ్మో… ఏంది ఈ సాలీడులు.. ఇవి ఇలాగే ఉంటే ఇంటినే తినేస్తాయనుకున్నాడో ఏమో. వెంటనే బ్లో టార్చ్ తో వాటిని చంపడం మొదలు పెట్టాడు. బ్లో టార్చ్ అంటే ఆ టార్చ్ నుంచి మంట వస్తుంది. ఆ మంటే వాళ్ల కొంపను ముంచింది. ఆ మంటకు ఇల్లు అంటుకుంది. మొత్తం బుగ్గిపాలైంది. కాకపోతే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదట. కానీ.. ఇల్లు మాత్రం బూడిదైపోయింది. చూశారా.. మనోడు ఏదో చేద్దామనుకొని ఏం చేశాడో.

Read more RELATED
Recommended to you

Latest news