నాచురల్ స్టార్ నాని కొన్నాళ్లు కెరియర్ లో బాగా వెనుకపడి ఉండగా ఎవడే సుబ్రహ్మణ్యం నుండి ఎం.సి.ఏ వరకు వరుసగా 6 హిట్లు కొట్టాడు. అయితే ఈ ఇయర్ వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు నిరాశపరచాయి. ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్న నాని ఆ సినిమా తర్వాత విక్రం కుమార్ తో మూవీ చేస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తుందట.
ఇదిలాఉంటే క్రేజీ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో నాని సినిమా ఉంటుందని లేటెస్ట్ టాక్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న అనీల్ రావిపుడి మాస్ అభిమానుల పల్స్ పట్టేశాడని అనుకుంటున్నారు. కమర్షియల్ సినిమాకు కామెడీ టచ్ ఇస్తూ వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తున్నాడు అనీల్ రావిపుడి.
ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్-2 మూవీని డైరెక్ట్ చేస్తున్న అనీల్ రావిపుడి తర్వాత నానితోనే ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఈ మూవీని కె.ఎస్ రామారావు నిర్మిస్తారట. మరి నానితో అనీల్ రావిపుడి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.