అక్కడ ఎవరైనా రజిని తర్వాతే..!

-

లింగా, కబాలి, కాలా సినిమాలు ఆశించిన ఫలితాలు రాకున్నా రజిని స్టామినా కొద్ది ఆ సినిమాలు కోలీవుడ్ లో ఎలాగోలా నెట్టుకొచ్చాయి. రజిని సినిమా అంటే ముందునుండి అంచనాలు భారీగా ఉంటాయి. అదే శంకర్ లాంటి క్రేజీ డైరక్టర్.. రోబో లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ గా అయితే ఇక ఆ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అనుకున్నట్టుగానే 2.ఓ అంచనాలకు మించి వచ్చింది.

శంకర్, రజిని కాంబో స్టామినా తెలియచేసేలా 2.ఓ కలక్షన్స్ చూస్తే తెలుస్తుంది. ఏరియా వైజ్ గా చూస్తే తెలుగులో ఊహించిన దాని కన్నా కొద్దిగా తక్కువే వసూళ్లను రాబట్టినా చెన్నైలో మాత్రం 2.ఓ మరోసారి రికార్డ్ సృష్టించింది. రజిని సినిమా అంటే తమిళనాట వసూళ్ల బీభత్సం సృష్టించాల్సిందే. చెన్నైలో మొదటి రోజు 2.ఓ 2.64 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈమధ్యనే వచ్చిన విజయ్ సర్కార్ 2.37 కోట్లు రాబట్టి చెన్నైలో నంబర్ 1 స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డులను రజిని బ్రేక్ చేసి ఎవరైనా సరే తన తర్వాతే అనేలా సత్తా చాటాడు. వరల్డ్ వైడ్ గా 2.ఓ ఫస్ట్ డే కలక్షన్స్ ఎంత అన్నది అఫిషియల్ గా తెలియలేదు. దాదాపు 100 కోట్లు వచ్చి ఉంటాయన్నది ట్రేడ్ పండుతుల మాట.

Read more RELATED
Recommended to you

Latest news