నాని సంచలన పోస్ట్! అర్ధం కాని నెటిజన్స్ అయోమయం.!

-

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా సినిమా  మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. తాను ఆశించినట్లు ఈమూవీ ప్రచారం కోసం మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తానా’  విడుదలైంది. అలాగే ఈ సినిమా లో నటిస్తున్న హీరోయిన్ కీర్తీ సురేష్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఇది కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఇక హిట్ కోసం నాని మొత్తం  మమ మాస్ లాగా  తయారు అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు. ఇక పోస్టర్ వెనకాల సిల్క్ స్మిత పోస్టర్ పెట్టుకొని మా సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని సింబాలిక్ గా చెబుతున్నాడు. సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక తాజాగా నాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెటిజన్స్ కు అర్ధం కాకుండా ఉంది. దీనిపై అందరూ తలో రకంగా స్పందిస్తూ ఉన్నారు. వాస్తవానికి నాని పెట్టిన పోస్ట్ లో జస్ట్ ఒకటే కాకపోతే రెండిటి కన్నా లేకపోతే అంతకన్నా ఎక్కువే” అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు. దీనితో దసరా సినిమా ఒకటే కానీ రెండు కంటే ఎక్కువ సినిమాల పవర్ ఉందని అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news