బేటీ బచావో కేవలం వంచన మాత్రమే – రాహుల్ గాంధీ

-

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు నిరసన తెలుపుతున్న క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన చేపట్టిన రెజ్లర్లకు, ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అయితే ఢిల్లీ పోలీసులు తమను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని, తోపులాటలో అధికారులు మాపై దాడి చేశారని అథ్లెట్లు ఆరోపించారు.

కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై దాడి చేశారని రెజ్లర్లు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురికి తలపై గాయాలయ్యాయి. అయితే తాజాగా ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ. “దేశ ఆటగాళ్లతో ఇలాంటి ప్రవర్తన సిగ్గుచేటు. బేటి బచావో కేవలం వంచన మాత్రమే. నిజానికి భారతదేశపు కుమార్తెలను చిత్రహింసలకు గురిచేయడానికి బిజెపి ఏనాడు వెనుకంజ వేయలేదు” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news