నటసింహం బాలకృష్ణ హీరోగా ఈ ఏడాది ప్రధమంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ రెండు సినిమాలు కూడా రిలీజ్ తరువాత ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. దానితో కొంత ఆలోచనలో పడ్డ బాలయ్య, తనకు గత ఏడాది సంక్రాంతికి జైసింహా వంటి మంచి సినిమాని అందించిన కేఎస్ రవికుమార్ తో మరొక సినిమా చేయాలని భావించి, ఇటీవల రూలర్ సినిమా అవకాశం ఆయనకు ఇచ్చారు.
వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రూలర్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ సినిమా కూడా ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందుకోలేక, ప్రస్తుతం ఘోరమైన ఫ్లాప్ దిశగా ముందుకు సాగుతోంది. దీనితో ప్రస్తుతం బాలయ్య ఫిలిం కెరీర్ కొంత డైలమాలో పడింది. అయితే కొద్దిరోజుల క్రితం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేసిన బాలయ్యకు, ప్రస్తుతం హిట్ కోసం బోయపాటే దిక్కయ్యాడు. నిజానికి కొన్నేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా సినిమా రిలీజ్ కు ముందుకు ఎన్నో ఫ్లాప్స్ ఎదుర్కొన్న బాలయ్యకు, బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా, అత్యద్భుత విజయాన్ని అందుకుని బాలయ్య కెరీర్ లో అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది.
ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం వారిద్దరూ కలిసి చేసిన లెజెండ్ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి బాలయ్యకు సూపర్ హిట్ ని అందించింది. మళ్ళి ప్రస్తుతం బాలయ్యకు వరుస ఫ్లాప్స్ వస్తున్న నేపథ్యంలో బోయపాటే ఆయనను ఆదుకునే పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఇటీవల రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ తో భారీ పరాజయాన్ని అందుకున్న బోయపాటి, ఈ సినిమాతో ఒకేసారి తామిద్దరికీ పెద్ద హిట్ లభించేలా సినిమా కథను ఎంతో పవర్ఫుల్ గా సిద్ధం చేసాడట. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను మే లో రిలీజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి….!!