మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన నవీన్ పొలిశెట్టి..వీడియో వైరల్

-

జాతిరత్నాలుతో ఒక్కసారిగా ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి. కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌ అందుకుంది. ఇక ఈ టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న తాజా సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ఈ రామ్-కామ్ ను మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ మంచి ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే.. నిన్న మల్లారెడ్డికి చెందిన ఓ కాలేజీలో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి హీరో పొలిశెట్టి సందడి చేశారు. ఈ సినిమాను ప్రమోట్‌ చేసే నేపథ్యంలో.. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్‌ చేశారు నవీన్‌ పొలిశెట్టి.

Read more RELATED
Recommended to you

Latest news