క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

-

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్‌ కాబోతుంది.

లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి పేరు పెట్టి తెచ్చుకున్న హీరోయిన్ నయనతార లేడీ సూపర్ స్టార్ గా కూడా అభిమానుల మనసులు దోచుకున్న ఈమె స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది అంతే కాకుండా ఈమె నటించిన చిత్రాలు హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతున్నాయి అయితే ఇప్పటికే ఎన్నో హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రల్లో నటించిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్లలో సందడి చేసేందుకు వస్తుంది. తమిళంలో రూపొందిన ఈచిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. అలాగే రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్‌ శివన్‌ తమిళంలో నిర్మించారు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించారు. కాగా.. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 22న చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.. అలాగే హర్రర్‌ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్.

తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన `గేమ్ ఓవర్` కూడా సూపర్ హిట్టయ్యింది. నయనతార నాయికగా ఆయన రూపొందించిన “మయూరి” సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. `కనెక్ట్` చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన `కనెక్ట్‌` టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయని చిత్ర బృందం తెలిపింది.. అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news