బిచ్చ‌గ‌త్తెలా ఉన్నావ్‌.. ఏంటీ డ్రెస్‌.. ఊర్వ‌శి రౌతెలాపై నెటిజ‌న్ల కామెంట్లు..

బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతెలా ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. త‌న దైన శైలిలో ఈమె ఎప్పుడూ ఫ్యాష‌న్‌ను పాటిస్తుంటుంది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె ఫొటోలు మ‌రోసారి వైర‌ల్ అవుతున్నాయి. ఆమె వేసుకున్న డ్రెస్‌పై నెటిజ‌న్లు దారుణ‌మైన కామెంట్లు చేస్తున్నారు.

సెల‌బ్రిటీ ఫొటోగ్రాఫర్ యోగెన్ షా తాజాగా ఊర్వ‌శి రౌతెలాకు చెందిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. వాటిల్లో ఆమె డెనిమ్ జీన్స్ ధ‌రించి ఉండ‌డం విశేషం. కానీ కింద ప్యాంట్ మాత్రం అనేక చోట్ల చించి ఉంది. అయితే ఆ డ్రెస్‌ను వేసుకున్న ఆమెను నెటిజ‌న్లు దారుణంగా విమ‌ర్శిస్తున్నారు.

బిచ్చ‌గ‌త్తెలా ఉన్నావ్.. ఆ డ్రెస్ ఏంటి ? అని చాలా మంది ఆమెను బిచ్చ‌గాళ్ల‌తో పోలుస్తూ కామెంట్లు చేశారు. అయితే కొంద‌రు మాత్రం ఊర్వ‌శి రౌతెలాకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆమె డ్రెస్ ఆమె ఇష్టం, రూ.కోట్ల‌లో సంపాదిస్తోంది, న‌టిగా గుర్తింపు పొందింది, ఆమె ఎలా ఉంటే మ‌న‌కెందుకు, ఏం డ్రెస్ వేసుకుంటే మ‌న‌కెందుకు ? అంటూ ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఊర్వ‌శి రౌతెలా 2015లో మిస్ దివా యూనివ‌ర్స్ కిరీటాన్ని సాధించ‌గా ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, భాగ్ జానీ వంటి చిత్రాల్లో న‌టించి అల‌రించింది.