9 ‘‌అంకె’ గొప్ప‌దంటారు.. చాల‌మంది సెల‌బ్రిటీల‌ ల‌క్కీ నెంబ‌ర్ 9, కారు నెం 9999

-

ఈ మ‌ద్య కాలంలోసంఖ్యా శాస్త్ర ప్రాముఖ్య‌త బాగా పెరిగిపోయింది. అందునా 9వ నెంబ‌ర్‌కు ఉన్న ప్ర‌త్యేక‌త అంతా ఇంతా కాదు. ఫ్యాన్సీ నెంబ‌ర్లంటూ కార్ల‌కు 9 వ‌చ్చేలా ప్ర‌య‌త్నిస్తూ ఉండ‌టం చూస్తూనే ఉన్నాం. 9999 కోసం ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించిన సెల‌బ్రీటీల గురించి వార్త‌లు చ‌దివాం. అస‌లు సంఖ్యా శాస్త్ర ప్ర‌కారం 9కి ఉన్న గొప్ప‌ద‌నం ఏంటి..?? 9వ నెంబ‌ర్ కు ఎందుకు అంత ప్రాముఖ్య‌త అనేది తెలుసుకుందాం..

Importance of Number 9
Importance of Number 9

సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదవ అంకెను ‘బ్రహ్మసంఖ్య’‌ , ‘దైవసంఖ్య’, వృద్ధి సంఖ్య అని అంటారు.
‘పురాణ సంఖ్య’ అని కూడా 9వ నెంబ‌ర్ కు పేరుంది. ఈ తొమ్మిదవ సంఖ్య గొప్పదనమేమిటో పరిశీలిద్దాం.
మీరు ఏదైనా మీ యిష్టం వచ్చిన సంఖ్యను తీసికొని ఆ సంఖ్యను తొమ్మిది చేత గుణించండి. ఏ సంఖ్య‌తో అయితే మీరు 9తో గుణిస్తారో అదే నెంబ‌ర్ ఫ‌లితంగా వ‌స్తుంది. 123456789X9 = 1111111101 మొత్తం అంకెలను కలిపి చూడండి.

ఉదాహ‌ర‌ణ‌కు 9ని 2తో గుణిస్తే.. 18 వ‌స్తుంది.. 18ని కూడితే (1+8) వ‌చ్చే ఫ‌లితం 9. అలాగే 9ని 3 గుణిస్తే 27 వ‌స్తుంది.. మొత్తంగా చూస్తే వ‌చ్చే ఫ‌లితం 9దే. ఇక 9తో ఏదైనా సంఖ్య‌ను క‌లిపితే.. అదే సంఖ్య ఫ‌లితం గా వ‌స్తుంది. 9ని మిర్ర‌ర్ అంకెగా బావించొచ్చు.. ఎలాగంటే 9కి ఏ సంఖ్యఅయితే క‌లుపుతారో అదే సంఖ్య ఫ‌లితంగా వ‌స్తుంది. అంటే 9 కి 2 క‌లిపితే 11 వ‌స్తుంది.. ఈ 1+1 = 2, అలాగే 9+3 = 12(టోట‌ల్ 3).

ఈ విధంగా ఎంత చిన్న ఎంత పెద్ద సంఖ్యనైనా తొమ్మిదిచే హెచ్చించండి లేదా క‌లిపి చూడండి.

ఇలాగే తొమ్మిదవ ఎక్కాన్ని కూడా పరీక్షించండి. శేషాలను కలిపి చూడండి. కృతయుగ సంవత్సరాలు 17.28,000-త్రేతాయుగం 12.96.000ద్వాపరయుగం 8.64.000 ఏ యుగపు సంవత్సరాలు కలిపినా తొమ్మిదే వస్తుంది. నాల్గుయుగాలను కూడినా అంతే !

ఇది తొమ్మిదవ అంకెకుమాత్రమే వున్న ప్రత్యేకత! సున్నా తీసివేస్తే మనకున్న అంకెలు మొత్తం తొమ్మిదేగదా! మహామహేతిహాసమని పేరుపొందిన మహాభారతం మొత్తం తొమ్మిదవ సంఖ్యతో ముడిపడివుంది. మహాభారతంలోని పర్వాలు 18, మహాభారత యుద్ధ దినాలు 18, మహాభారత సైన్యం 18 అక్షౌహిణులు, భగవద్గీత అధ్యాయాలు 18. (ఒకటిని ఎనిమిదిని కలిపితే తొమ్మిది అవుతుంది) భగవాన్ వ్యాసమహర్షి రచించిన పురాణాలు కూడా పద్దెనిమిది. ఒకటినుండి తొమ్మిది వరకు మొత్తం అంకెలు కూడితే ‘తొమ్మిది’ వస్తుంది.

12243+4+5+6+7+8+9 = 81,811 మనిషి శరీరానికి వున్న రంధ్రాలు కూడా ‘తొమ్మిది”. సరానికి తప్ప సృష్టిలోని ప్రతి ప్రాణికి తొమ్మిది రంధ్రాలుండవల్సిందే.

3.600 సెకండ్లు – 3+6+0+0 = 9
1.440 విముషాలు – 1+4+4+0 = 9 నెలకు
720 గంటలు . 7+240 = సంవత్సరానికి 360 రోజులు . 3+6+0 = 60 సంవత్సరాలకు 720 నెలలు – 7+2+0 – = 9 .60 సంవత్సరాలకు 21.600 రోజులు -2+1+6+0+0 = 9

తొమ్మిదవ సంఖ్యను ప్రేమించేవారు ఆరవ సంఖ్యను ఇష్టపడరు. తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు. బిడ్డ తల్లి గర్భంలో వుండేది 270 రోజులు. 2+7+0=9 ఇన్ని కారణాలుగా తొమ్మిది గొప్పది.

ఇలాంటి కార‌ణాల వ‌ల్ల తొమ్మిదిని ప్ర‌త్యేక సంఖ్య‌గా భావిస్తారు. అలాగే 9 సంఖ్య వ‌ల్ల అభివృద్ధి చెందిన‌ట్లుగా చాలా మంది న‌మ్ముతారు కూడా. సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులను గ‌మ‌నిస్తే వారి ల‌క్కీ నెంబ‌ర్ 9 గా ఉంటుంది. అలాగే వారు వాడే కార్ల నెంబ‌ర్లు మొత్తం కూడితే 9 వ‌చ్చేలా చూసుకుంటారు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా ఉండేవారు 9999ని తీసుకుంటారు. అందుకే ఈ 9999 నెంబ‌ర్ కోసం ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించ్చాల్సిందే.

అలాగే దుర‌దృష్టం తీసుకువ‌చ్చే నెంబ‌ర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ నెంబ‌ర్లు దేశాన్ని బ‌ట్టి మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క‌రి న‌మ్మ‌కాలు ఒక్కోలా ఉండ‌ట‌మే. ఏ దేశాల్లో ఏ నంబర్లు దురదృష్ట సంఖ్యలో మీకు తెలుసా? మ‌న‌లోకం.కామ్ లో చూడ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news