దక్షిణాది సినిమా రంగంలో వరుస విజయాలు అందుకు ని స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది తాప్సి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ అనేక అవకాశాలు అందుకుంది. అయితే ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. దీంతో తాప్సి పై విమర్శలు రావడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఎక్కడా కూడా నిరుత్సాహ పడకుండా తాప్సి సినిమాలు చేస్తూ తాజాగా థప్పడ్ ఈ సినిమాలో అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ తాప్సీ కుర్ర హీరోల పై రెచ్చిపోయే కామెంట్లు చేసింది. ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ..కొందరు హీరోయిన్స్ కు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు.. కొత్త హీరోలు కుర్ర హీరోలు వారితో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. నాతో నటించేందుకు పలువురు హీరోలు ఆసక్తి చూపించలేదు.
ఎందుకంటే నాతో నటిస్తే వారిని ప్రేక్షకులు పట్టించుకోరు అనేది వారి అభిప్రాయం. హీరోయిన్ గా పనికిరావు అని అన్నా కొంత మంది స్టార్ హీరోలు కనిపించకుండా పోయారని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఒక్క విషయం అందుకున్న తాప్సీ ఎందుకమ్మా ఇంత హడావిడి నీకు హిట్ కొట్టావు ఆనందించు అంతేగాని అంత రెచ్చిపో అక్కర్లేదు హీరోయిన్ పాపా అంటూ సోషల్ మీడియాలో తాప్సీ చేసిన కామెంట్ లపై నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.