నెక్ట్స్ మూవీ ఢిల్లీ ఫైల్స్.. వివేక్ అగ్ని హోత్రి అఫిషియ‌ల్ అనౌన్స్

-

భారతీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ది కశ్మీర్ ఫైల్స్ ప్రత్యేక ముద్ర వేసింది. ఈ సినిమాతో డైరెక్ట‌ర్ వివేక్ అగ్ని హోత్రి క్రేజ్ కూడా ఒక్క సారిగా పెరిగింది. కాగ ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన క‌శ్మీర్ ఫైల్స్ .. అంచ‌నాలు తారుమారు చేస్తు రికార్డుల‌ను సృష్టించింది. ఏకంగా భారత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ యే.. ఈ సినిమాను అంద‌రూ చూడాల‌ని చెప్పారు.. అంటే క‌శ్మీర్ ఫైల్స్ ఏ రేంజ్ లో ఆడిందో తెలుస్తుంది. చాక్లెట్, హేట్ స్టోరీ, జిద్ వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది వివేక్ అగ్ని హోత్రి అయినా.. ఈ సినిమాల‌కు రాని టాక్.. క‌శ్మీర్ ఫైల్స్ వ‌చ్చింది.

క‌శ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా జ‌మ్ము క‌శ్మీర్ లో జ‌రిగిన న‌ర‌మేధం గురించి వివేక్ అగ్ని హోత్రి చూపించాడు. క‌శ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆదార‌ణ చూపినంద‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలిపాడు. క‌శ్మీర్ ఫ‌ల్స్ సినిమాను చేయ‌డానికి నాలుగేళ్లు క‌ష్ట ప‌డ్డ‌ట్టు తెలిపారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో వివేక్ అగ్ని హోత్రి మ‌రో సంచ‌ల‌న ప్రాజెక్ట్ చేప‌డుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌న త‌ర్వాతి సినిమా ఢిల్లీ ఫైల్స్ అని అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. అతి త్వ‌ర‌లోనే ఢిల్లీ ఫైల్స్ సినిమా చిత్రిక‌ర‌ణ ప్రారంభిస్తామ‌ని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news