కోర్కెలు తీర్చే సొరకాయ స్వామి.. ఎక్కడో కాదు మన ఆంధ్రాలోనే

-

దేవుడికి కొబ్బరికాయలు, పండ్లు, తలనీలాలు ఇలాంటివి ఇచ్చి మొక్కతీర్చుకోవడం కామన్.. కానీ కొన్ని ప్రాంతాల్లో.. భక్తులు తమ కోరికెల తీరిన తర్వాత ఇచ్చే కానుకలు వెరైటీగా ఉంటాయి. ఒక దగ్గర గుళకరాళ్లు ఇచ్చి మొక్కుతీర్చుకుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేదీ ఇంకా క్రేజీ.. ఆ దేవుడికి సొరకాయ ఇచ్చి ఏదైనా కోరిక కోరితే.. అది కచ్చితంగా తీరుతుందట.. సొరకాయ స్వామిగానే ఆయన ప్రసిద్ధి చెందారు. ఇంతకీ ఎవరా దేవుడి, ఏంటా కథ చూద్దామా.!

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో సొరకాయ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా.. ప్రసిద్ధిగాంచారు. కోర్కెలు తీరిన వారు సొరకాయలు కడతారు. ఇక్కడి దేవుడు కూడా సొరకాయల స్వామిగానే ప్రసిద్ధి.

అసలేం జరిగిందంటే..

తిరుపతి జిల్లా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని నారాయణవనంలో ఉంది ఈ సొరకాయల స్వామి ఆలయం. పూర్వకాలంలో చెన్నై, పుత్తూరు, పరిసరాలు సందర్శిస్తూ ఒక స్వామి చివరగా శ్రీవారి దర్శనార్థం ఈ ప్రాంతానికి వచ్చారట..ఆ వెంకటేశ్వరున్ని దర్శించుకుని వెళ్లుతున్న సమయంలో నారాయణవనం కనిపించిందట.

అక్కడి పరిసరాలు, ప్రకృతి ఎంతగానో నచ్చి శ్రీమన్నారాయణున్ని స్మరిస్తూ..ఇక్కడే నిత్యం ధ్యానంలో వుండేవారట ఆ స్వామి.. అయితే ఆ స్వామి భుజాన ఎప్పుడు ఓ సొరకాయ సంచి వేలాడుతూ వుండేదట. భక్తులు అనారోగ్యంతో తన దగ్గరికి వస్తే తన భుజాన ఉన్న సొరకాయ నుంచి ఔషధాలు అందించి ఆశీర్వదించేవాడట.

ఆ ఔషధం స్వీకరించిన వారికి ఎటువంటి రోగమైన నయం అయ్యేదట, అలా కొంతకాలానికి ఈ విషయం ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి వ్యాపించి.. ఆయన దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. అలా ఈ స్వామి 200 ఏళ్లు పైగా జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక ఆయన జీవ సమాధి ఆనంతరం ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఆలయంలో సొరకాయలు మొక్కుగా సమర్పించుకోవడం ఆనవాయితీగా మారింది.

ఇలా సొరకాయ స్వామిగా ఆయన ప్రసిద్ది చెందారు. తిరుపతి ప్రజలకు నారాయవణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఆలయంలో ఎక్కడ చూసిన వేలాడుతున్న సొరకాయలే కనిపిస్తాయి. ఇంకా ఆ కాలంలో ఆ స్వామివారు ఉపయోగించిన కొన్ని వస్తువులను కూడా గుడిలో భక్తులు చూసే విధంగా భద్రపరిచారు. ప్రతినెల పౌర్ణమి, అమావాస్యలో ఈ స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. బోర్డర్లో ఉండంటంతో.. తమిళనాడు నుంచి కూడా వేలాది భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వామివారిని పూర్తి విశ్వాసంతో ఏ కోరిక కోరినా తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news