తల్లి కాబోతున్న నిహారిక.. క్లారిటీ ఇదే..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా మారి పలు సినిమాలలో నటించింది. అంతేకాదు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించినా.. నిహారికకు సినిమా ఇండస్ట్రీ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. దాంతో యాక్టింగ్ కి గుడ్ బై చెప్పిన ఈమె ప్రస్తుతం నిర్మాత గా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా నిహారిక వైవాహిక బంధం లో గొడవలు వచ్చాయని.. ఆమె విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

కానీ ఈ విషయంపై అటు నిహారిక ఇటు చైతన్య అటు ఫ్యామిలీలు కూడా స్పందించకపోవడం గమనార్హం. ఇకపోతే నిహారిక గత వారం నుంచి బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది.. మొన్నటికి మొన్న రెడ్ కలర్ లంగా వోని ధరించి దేవతలా కనిపించిన ఈమె ఇప్పుడు మరొక ఫోటోషూట్ తో అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా అందమైన పింక్ కలర్.. దానిపైన స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ధరించి ముక్కుకు ముక్కెర పెట్టుకొని అందరినీ ఆకట్టుకుంది. నోట్లో మామిడి ముక్క తో రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను మొత్తం కలిపి ఒక వీడియో తయారు చేసి పోస్ట్ చేసింది.. అందుకు క్యాప్షన్ గా” మామిడికాయలు లేకుండా సమ్మర్ ఏంటి ? అంటూ చెప్పుకొచ్చింది.. ఇందులో నిహారిక చాలా అందంగా కనిపించినప్పటికీ మామిడికాయ తింటున్న నిహారికను చూసి ఏమన్నా విశేషమా? ప్రెగ్నెంటా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఆమె ఏదో సమ్మర్ వచ్చింది కదా ప్రతి సీజన్లో పండును రుచి చూడాలి అంటారు.. అందుకే ఆమె అలా రుచి చూస్తే కొంత మంది మాత్రం ఇలా కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నిహారిక ఇప్పుడు ఏం చేసినా ట్రోల్స్ ఎదుర్కోక తప్పట్లేదు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Read more RELATED
Recommended to you

Latest news