సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీపై నిఖిల్ స్పై మూవీతో క్లారిటీ రానుందా!

-

నిఖిల్ స్పై: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం స్పై.. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం టైటిల్, లోగోను రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడమే కాకుండా ఫస్ట్ లుక్ పై అప్డేట్ ఇచ్చేసింది..

టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో ఒకరిగా మంచి పేరు సంపాదించుకున్న నిఖిల్ ప్రస్తుతం విభిన్న కథలతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’తో నిఖిల్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని.. ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ప్రస్తుతం యాక్షన్ త్రిల్లర్ స్పై తో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనిట్ సినిమాపై ఆసక్తిపెంచేలా అప్డేట్స్ వదులుతున్నారు. తాజాగా టైటిల్ లోగో, రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

 

నెట్టింట వైరల్ గా మారుతున్న లోగో సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తోంది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ముఖంతో ఉన్న లోగోను విడుదల చేసిన చిత్ర బృందం ఆయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను సినిమాలో తెలుపబోతున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా అత్యంత రహస్యంగా ఉంచిన మరిన్ని విషయాలు సినిమాలో రివిల్ చేయబోతున్నట్టు సమాచారం. అలాగే ఫస్ట్ లుక్ టీజర్ ను మే 12న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా ఐశ్వర్య మీనన్ కనిపించబోతోంది. ఆర్యన్ రాజేష్ ప్రముఖ పాత్రలో కనిపించగా ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news