కోన వెంకట్ ని ఆపుతున్న నిశబ్ధం ..ఇది ఆయనకి ప్లస్సా మైనస్సా ..?

కోన వెంకట్ …ఇప్పటి వరకు టాలీవుడ్ లో రైటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారో అందరికి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి కావడం విశేషం. ఈ 20 ఏళ్ళలో కోన వెంకట్ 50 సినిమాలు కంప్లీట్ చేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథ అందించిన కోన వెంకట్ కొన్ని సినిమాలకి పాటలు రాశారు. అలాగే చిన్న చిన్న పాత్రల్లోను స్క్రీన్ మీద మెరిశారు. ఇక నిర్మాతగా గీతాంజలి, నీవెవరో, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలని నిర్మించారు.

 

ఇక స్టార్ హీరోయిన్ అనుష్క తో ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ సినిమాని నిర్మించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకి హేమంత్‌ మధూకర్‌ దర్శకత్వం వహించాడు. నాలుగు ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

ఇక ఈ సినిమాలో అనుష్కతో పాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే.. ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అన్ని భాషల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత కోన వెంకట్ దర్శకుడిగా మారబోతున్నారు. ఇప్పటికే తను డైరెక్ట్ చేయబోయో సినిమాకి స్క్రిప్ట్ ని కూడా సిద్దం చేసుకున్నారట. నిశబ్ధం రిలీజ్ కాగానే తన సినిమాని అధికారకంగా వెల్లడించనున్నారట. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలీలేదు. మొత్తానికి ‘నిశ్శబ్దం’ కోన వెంకట్ ని డైరెక్టర్ గా సినిమాని పట్టాలెక్కించకుండా ఆపుతోంది.