పెళ్లి త‌ర్వాత జైలుకు వెళ్లనున్న హీరో నితిన్‌.. ఎందుకో తెలుసా..?

-

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ఉన్న హీరో నితిన్‌. నూనూగు మీసాల వయసులోనే నితిన్ జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలోనే యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. తన ప్రేయసి షాలినితో నితిన్ వివాహం జరబోతుంది. తాజాగా హైదరాబాదులోని నితిన్ నివాసంలో అత్యంత సన్నిహితుల మద్య నిశ్చితార్థం వేడుక జరిగింది. ఏప్రిల్ 16 న వీరి వివాహం దుబాయ్ లో జరుగుతుందని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత నితిన్ జైలుకి వేల్లనున్నాడట. ఆగండి.. ఆగండి.. జైలు అంటే నిజమైన జైలు కాదు లెండి!

విభిన్నమైన కథలని తెరకెక్కించే చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నితిన్‌ ఓ ఖైదీగా కనిపించనున్నాడు. అయితే దాదాపుగా అరవై శాతం సినిమాని జైల్లోనే తెరకెక్కిస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన తాజాగా చిత్రం ‘భీష్మ’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ప్రస్తుతం నితిన్ ‘రంగ్‌ దే’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news