అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటనలు చేస్తున్నారు అనగానే ఒక ఆసక్తి ఉంటుంది అందరిలో. ఏ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరుగుతున్నాయి…? ఏ ఒప్పందాలు ఇరు దేశాలు చేసుకుంటున్నాయి…? ఏ అంగీకారానికి రెండు దేశాలు వస్తున్నాయి. కాశ్మీర్ అంశం ఎం మాట్లాడుకుంటారు…? ఏమైనా వాణిజ్యంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా…? చైనా, పాకిస్తాన్ విషయాలు ప్రస్తావనకు వస్తాయా…?
ఇలా ఆసక్తి ఉంటుంది. కాని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, మోదీ భారత్ మధ్య కోడి కాళ్ళ ప్రస్తావన ఉంటుంది. అవును కోడి కాళ్ళ గురించే ఈ ఇద్దరి భేటీ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అమెరికాలో లెగ్ పీస్ లు అక్కడి ప్రజలు తినరు. దీనితో ఇప్పటి వరకు వాటిని ఆఫ్రికా దేశాలకు కూడా అమెరికా ఎగుమతి చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు వాటిని ఎక్కువగా భారత్ లోని ముఖ్య నగరాలకు ఎగుమతి చెయ్యాలని అమెరికా భావిస్తుంది.
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, చెన్నై, నోయిడా, బెంగళూరు, కలకత్తా, ఇలా చాలా నగరాల్లో కేఎఫ్సిలు ఉన్నాయి. అలాగే అనేక రెస్టారెంట్ లు తందూరి పేరుతో లెగ్ పీస్ లను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. మన వాళ్ళు వాటిని ఎక్కువగా తింటారు. దీనితో ఇరు దేశాల మధ్య కోడి కాళ్ళ ఒప్పందం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అమెరికాలో మిగిలిపోతున్న టన్నుల కొద్దీ కోళ్ల కాళ్ల ఒప్పందాన్ని చేసుకునే అవకాశం ఉంది.
అదే విధంగా కాశ్మీర్ విషయంలో అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ విషయంలో అమెరికా ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎంత సేపు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తుంది. దీనితో కాశ్మీర్ విషయంలో మాత్రం పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మనకు మద్దతుగా అమెరికా నిలిస్తే మాత్రం అంతర్జాతీయంగా మనకు మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డ్రాగన్ విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనేది చూడాల్సి ఉంది.