నిత్యామీనన్ ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ ఫస్ట్ లుక్ రిలీజ్ ..!

-

నిత్యా మీనన్ కి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ‘అలా మొదలైంది..’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన నిత్యా మీనన్…ఆ తర్వాత నితిన్ తో ఇష్క్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. గుండె జారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్యమూర్తి, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శివ గంగ, గీత గోవిందం వంటి సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 

ఇక ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న అమ్మ బయోపిక్ లో చాలా శక్తి వంతమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ తో తమిళ నాట భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఇదే బయోపిక్ లో నటిస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనౌత్ తో పోటీ పడుతోంది. ఇప్పటికే తమిళ ప్రేక్షకులు నితా మీనన్ బయోపిక్ తో కంగనా బయోపిక్ లుక్ ని కంపేర్ చేస్తూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక బాలీవుడ్ లో నటించిన మిషన్ మంగళ్ సినిమాతో నిత్య మీనన్ అక్కడ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తుంది. నటన కి ఆస్కారం ఉంటేనే సినిమా ఒప్పుకునే నిత్యామీనన్ మొదటి సారి వెబ్ సిరీస్ లో నటిస్తుందనగానే అందరీలోను ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. “బ్రీత్ ఇన్ టు ద షాడోస్” పేరుతో వస్తున్న వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఉత్కంఠతను రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version