పుకార్లు నమ్మొద్దు.. సమంత-చైతు విడాకులపై నాగార్జున సీరియస్ !

-

స‌మంత, నాగ చైత‌న్య విడాకాలపై కింగ్ నాగ‌ర్జున స్పందించాడ‌ని.. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల‌లో తెగ వైర‌ల్ అవుతుంది. ఈ విడాకాల వ్య‌వ‌హారంలో స‌మంతనే ఫ‌స్ట్ విడాకాలు అడిగింద‌ని.. అయితే నాగ‌ర్జున గురించి, స‌మాజం గురించి నాగ‌ చైత‌న్య ఆలోచించాడ‌ని నాగ‌ర్జున చెప్పిన‌ట్టు వార్తులు వైర‌ల్ అయ్యాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజా గా అక్కినేని నాగ‌ర్జున స్పందించాడు. స‌మంత – నాగ చైత‌న్య విడాకుల అంశం పై తాను ఎలాంటి కామెంట్ చేయ‌లేద‌ని తెల్చి చెప్పారు. సామాజిక మాధ్య‌మాల‌లో వ‌చ్చే ఈ వార్త‌లో ఎలాంటి స‌త్యం లేద‌ని అన్నారు.

అలాగే వార్త‌ల కోసం పుకార్లు వ్యాప్తి చేస్తారా.. అంటూ సీరియ‌స్ అయ్యారు. అల‌గే పుకార్లను వార్త‌లుగా రాయ‌డం, సామాజిక మాద్య‌మాల్లో పోస్టు చేయ‌డం మానుకోవాల‌ని జ‌ర్నలిస్టుల‌కు కింగ్ నాగ‌ర్జున సూచించాడు. అలాగే #GiveNewsNotRumours ట్యాగ్ ను కూడా జోడించారు. అయితే స‌మంత‌- చైతు విడాకాలు అంశం పై ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌ల్ అయిన వార్తను చూసి స‌మంత పై త‌ప్పుడు అభిప్రాయాన్ని నెటిజ‌న్లు వ్య‌క్తి చేశారు. కానీ ఈ పుకార్ల పై నాగ‌ర్జున క్లారిటీ ఇవ్వ‌డంతో పుకార్లును వ్యాప్తి చేసిన వారిపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. కాగ గ‌తంలో #GiveNewsNotRumours ట్యాగ్ ను మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version