బింబిసార పార్ట్‌ 2 లో NTR ఉండరు – కళ్యాణ్ రామ్

-

బింబిసార పార్ట్‌ 2 లో NTR ఉండరని సినీనటుడు కళ్యాణ్ రామ్ అన్నారు. ఇవాళ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. బింబిసార కథ బాగా నచ్చింది…దర్శకుడు వశిష్ట కథ చెప్పినప్పుడు సినిమా చేయాలనుకున్నానని తెలిపారు. చిన్నప్పటి నుంచి జానపద సినిమాలు చేయాలన్న కోరిక ఉండేదని.. జానపద సినిమాలు చూస్తూనే పెరిగానని తెలిపారు.

బింబిసార సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నాం….బింబిసార ఓ సోషియో ఫాంటసీ మూవీ అని వెల్లడించారు. రెండవ భాగంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండరు….బడ్జెట్ కు ఎక్కడా వెనకాడ లేదు.. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేశామన్నారు. మరో రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నా….సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని మేజర్, విక్రమ్ సినిమాలు నిరూపించాయని స్పష్టం చేశారు. కాగా… ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news