పోలవరం రివర్స్ టెండర్ పై చర్చ జరిగితే…సీఎం జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు దేవినేని ఉమా. పోలవరం అధారిటీ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ఏక పక్ష నిర్ణయాలు తీసుకున్నారని.. రివర్స్ టెండరుపై విచారణ జరిగితే జగన్ జైలు కి వెళ్తారన్నారు.
ఉభయ గోదావరి జిల్లా వాసులకు ముందస్తు సమాచారం లేకుండా ప్రజలను నట్టేట ముంచారు.. పశువులు కొట్టుకు పోయాయి . ఇళ్ళు, డబ్బు, వస్తువులు వదులుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొండలు, గుట్టలు ఎక్కి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవల్సిన పరిస్థితి వొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బారికేడ్లు కట్టుకుని, కార్డ్ లు ఇచ్చి పరామర్శలు చేసిన దుస్థితిలో సీఎం ఉన్నారు.. దవలేశ్వరం ఎస్.ఈ ఎందుకు సెలవు పై వెళ్లారు..వరదలు వొచ్చే సమయంలో డ్రేజింగ్ కాంట్రాక్ట్ పై దృష్టి పెట్టారన్నారు. వరద సమయంలో డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ ముఖ్యమా.. లేక లంక ప్రజల ప్రాణాలు ముఖ్యమా…అని ప్రశ్నించారు. గత మూడు ఏళ్ల లో వరద సాయం ఇస్తా అన్నారు.. ఇచ్చారా? ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాలుగు రోజుల పర్యటన చేశారు.. ఆ ప్రాంతాల్లో సీఎం రెండు రోజుల పర్యటన చేయగలరా? అని ఆగ్రహించారు ఉమా.