నిజంగా ఎన్టీఆర్ కేక; ఇండియాలో మొదటి హీరో అతనే…!

తన నుంచి అభిమానులకు ఎం కావాలి…? అభిమానులు తన నుంచి ఎం ఆశిస్తారు…? తాను ఏ విధంగా ఉంటే అభిమానులకు నచ్చుతుంది…? ఇది తెలిసిన ఒకే ఒక్క హీరో జూనియర్ ఎన్టీఆర్. అతను చేసే ఏ సినిమా అయినా సరే చాలా జాగ్రత్తగా చేస్తాడు. ప్రేక్షకులకు తన నుంచి కోరుకునేది అందిచడంలో అతను ఎప్పుడూ ముందు ఉంటాడు. ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే చేస్తున్నాడు తారక్.

సాధారణంగా ఇతర భాషల్లో ఏ సినిమా అయినా విడుదల అయితే హీరోలు డబ్బింగ్ చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ విషయంలో అలా చేయడం లేదు. అన్ని భాషలకు తన డబ్బింగ్ తానే చెప్పుకుంటున్నాడు. ఈ సినిమా ఇండియాలో హింది, కన్నడ, తమిళం, మలయాళ౦, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. దీనితో తన సినిమాకు తానే అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇలా చేయలేదు. రజని కాంత్, కమల్ హాసన్ ఇండియా వైడ్ హీరోలు అయినా సరే వాళ్ళు ఎప్పుడూ ఈ సాహసం చేయలేదు. కాని తారక్ మాత్రం తన గొంతుని ప్రపంచం మొత్తం వినిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్ లో అన్ని భాషల్లో కూడా తానే డబ్బింగ్ చెప్పాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.