ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్..!

-

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా రెండు పార్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2019 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ వస్తున్నాడా రాడా అన్న విషయంపై నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అయితే ఎన్.టి.ఆర్ ఆడియోకి జూనియర్ ఎన్.టి.ఆర్ వస్తున్నాడట. నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ ఆడియో వేడుకలో భాగమవుతుందని తెలుస్తుంది. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, అలనాటి తారలు గీతాంజలి, జమున లాంటి వారు కూడా ఎన్.టి.ఆర్ ఆడియోలో పాల్గొంటారని తెలుస్తుంది. ముందు నిమ్మకూరులో ఈ ఈవెంట్ ప్లాన్ చేసినా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ కార్యక్రమం జరుగనుంది.

మరి ఎన్.టి.ఆర్ కూడా వస్తున్నాడు కాబట్టి ఈ ఆడియో ఈవెంట్ కు మరింత కలరింగ్ వచ్చినట్టే. బాబాయ్, అబ్బాయ్ తో పాటుగా ఈ ఈవెంట్ లో నందమూరి ఫ్యామిలీ మొత్తం కనిపించి ఫ్యాన్స్ ను అలరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news