కల్హోనాహో సినిమాలోని టైటిల్ ట్రాక్ గుర్తుందా మీకు. అప్పట్లో ఆ పాట పెద్ద సంచలనం కదా. ఆ పాటను ఓ నైజీరియన్ అద్భుతంగా పాడాడు. ఆ టైటిల్ ట్రాక్ ను నైజీరియన్ పాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2003 లో వచ్చిన కల్హోనాహో సినిమాలోని టైటిల్ ట్రాక్ ను సోనూ నిగమ్ పాడాడు. ఈ నైజీరియన్ కూడా అచ్చం సోను నిగం వాయిస్ తోనే పాట పాడి అబ్బుర పరిచాడు. అతడు పాడుతుంటే మరో ఇద్దరు ఆయనకు కోరస్ ఇవ్వడం.. మొత్తానికి ఆ పాట నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.
(ఒరిజినల్ సాంగ్)