నటుడికి మొదటి ప్రేక్షకుడు దర్శకుడే.. త్రివిక్రం నాకు బావ : ఎన్.టి.ఆర్

-

అక్టోబర్ 11న రిలీజైన ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ను ప్రేక్షకులతో పంచుకునేందుకు చిత్రయూనిట్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పరిచారు.

ఈ సినిమా అనుభూతులను చెబుతూ త్రివిక్రం తో తనకు ఏర్పడిన బంధాన్ని వెళ్లడించాడు ఎన్.టి.ఆర్. 12 ఏళ్లుగా త్రివిక్రం ఓ మిత్రుడు ఇప్పుడు తన పిల్లలకు మామయ్య, తన భార్యకు అన్న, తనకు బావ అంటూ వరుసలు కలిపేసుకున్నాడు ఎన్.టి.ఆర్. ఈ సినిమా కంటే ముందు తనకు రెండు కథలు చెప్పాడని అవి తనకు నచ్చినా త్రివిక్రమే వాటిని కాదని ఈ సినిమా తన దగ్గరకు తెచ్చాడని అన్నాడు.

ఈ సినిమాలో ప్రతి సీన్ ఇంత బాగా వచ్చేందుకు దర్శకుడు త్రివిక్రం మొదటి కారణమని అన్నాడు. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో తను నరేట్ చేసిన విధానం తనకు బాగా నచ్చిందని తన పర్ఫార్మెన్స్ బాగుందని అందరు చెబుతున్నారు కాని అది దర్శకుడు చెప్పబట్టే అలా వచ్చిందని అన్నారు ఎన్.టి.ఆర్. నటుడికి మొదటి ప్రేక్షకుడు దర్శకుడు మాత్రమే అని.. ఈ సినిమా విజయంలో త్రివిక్రం దే ముఖ్య పాత్ర ఉందని చెప్పాడు. ఇక సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రస్థావిస్తూ సినిమా ఇంతలా విజయ సాధించింది అంటే అది సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి అన్నారు ఎన్.టి.ఆర్. 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news