‘నర్తనశాల’ షూటింగ్ టైమ్‌లో అంత ఇబ్బంది పడ్డ ఎన్టీఆర్.. ఒకటికి రెండు సార్లు అలా చేశారట..!

-

నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)..తెలుగు ప్రజలకు ఇష్టమైన నటుడే కాదు నాయకుడు అని చెప్పొచ్చు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన పోషించిన పాత్రల ద్వారా ఇప్పటికీ బతికే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు వారి ఇళ్లలో కృష్ణుడు, రాముడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలు ఉండటం మనం చూడొచ్చు.

సాంఘీకం, పౌరాణికం, జానపదం ఏ జోనర్ అయినా సరే..ఆ పాత్రల్లో జీవించేసేవారు ఎన్టీఆర్. అయితే, ఆయన ఏ సినిమా చేసినా ఒకటే టేక్ లో సీన్ కంప్లీట్ చేసేవారు. ఒకటికి మించిన టేక్ లు చేయడం వలన ప్రొడ్యూసర్ కు నష్టం జరగడంతో పాటు టైమ్ వేస్ట్ అయిపోతుందని ఆయన ప్రతీ ఒక్కరికి చెప్పేవారు. పౌరాణిక పాత్రలు పోషించే సమయంలోనూ ఆయన అలానే చేసేవారు. కానీ, ఆ ఒక్క చిత్రంలో మాత్రం ఎన్టీఆర్ సైతం కొంత ఇబ్బందపడ్డారు. ఒకటికి రెండు సార్లు మేకప్ చెక్ చేసుకోవడంతో పాటు రెండు లేదా మూడు టేక్ లు తీసుకున్న సందర్భాలున్నాయట. ఆ సినిమా ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

జనరల్ గా పౌరాణిక పాత్రల గెటప్ డిఫరెంట్ గా ఉండే సంగతి అందరికీ విదితమే. గెటప్ తో పాటు ఆ పాత్ర స్వభావం, డైలాగ్స్ ఉచ్ఛరణ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ యే స్వయంగా తనకు తానుగా మేకప్ వేసుకుని షెడ్యూల్ టైమ్ కు వచ్చేవారు. అంతటి జాగ్రత్తలు తీసుకున్న ఎన్టీఆర్..‘నర్తన శాల’ షూటింట్ టైమ్ లో మాత్రం కొంత ఇబ్బంది పడ్డారట. ఇందులో ‘కృష్ణుడు’, ‘అర్జునుడి’గా ఎన్టీఆర్ రెండు వేషాయలు వేయడంతో పాటు ‘బృహన్నల’ వేషం కూడా వేశారు. ఈ క్రమంలోనే ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఆరు నుంచి ఏడు టేక్ లు తీసుకున్న సీన్లు ఉన్నాయట.

‘బృహన్నల’ వేషం వేసుకున్న సమయంలో ఆ పాత్రకు తగ్గట్లు పూర్తిగా తన ఆహార్యం, నడక మార్చుకున్నారు ఎన్టీఆర్. ఒకటికి రెండు సార్లు మేకప్ చెక్ చేసుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేశారట ఎన్టీఆర్. అలా ఎన్టీఆర్ ఆయా పాత్రల పట్ల అంత జాగ్రత్త తీసుకున్నందు వల్లే ఆ పాత్రలు చిరకాలం గుర్తుండిపోయే విధంగా వెండితెర మీద ఆవిష్కృతం అయ్యాయని సినీ పరిశీలకులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news