ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్ టాక్.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి రెండో పార్ట్ గా రాబోతున్న మహానాయకుడు ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ ట్రైలర్ ఆకట్టుకుంది. కథానాయకుడు చివర్లో పొలిటికల్ టచ్ ఇచ్చిన క్రిష్ ఇక సెకండ్ పార్ట్ లో మొత్తం అదే చూపించాడు.

ఇక ఈ ట్రైలర్ లో ప్లస్సుల విషయానికొస్తే.. ఎన్.టి.ఆర్ ప్రవేశ పెట్టిన కొన్ని మంచి పథకాలను గూర్చి చర్చిస్తారని తెలుస్తుంది. అవి అంతేకాదు 2 రూపాయలకు కిలో బియ్యం పథకం చూపించారు. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ కూడా ఉంది. అయితే వైశ్రాయ్ హోటెల్ విషయన్ని మాత్రం స్కిప్ చేసినట్టు తెలుస్తుంది.

ముందునుండి చెబుతున్నట్టుగానే ఎన్.టి.ఆర్ జీవితం అది కూడా బసవతారకం కాలం చేసేంత వరకే తీస్తున్నారని అంటున్నారు. మహానాయకుడు ట్రైలర్ లో కూడా అదే అర్ధమవుతుంది. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news