స్కూటీపై ఎన్.టి.ఆర్, చరణ్.. వైరల్ అవుతున్న వీడియో..!

-

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు రియల్ హీరోస్ కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వడోదరాలో జరుపుకుంటుంది. అక్కడ చరణ్ స్కూటీపై వచ్చి తారక్ ను పిలవగా కార్ వ్యాన్ నుండి దిగి ఎన్.టి.ఆర్ ఏకంగా జరుగు నేను డ్రైవింగ్ చేస్తా అని అంటాడు.

స్కూటీపై తారక్, చరణ్ ఇద్దరు కలిసి చేసిన హంగామా బాగుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి స్కూటీపై వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 31న రిలీజ్ ఫిక్స్ చేశారు. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news