షియోమీ.. స్మార్ట్ ఫోన్స్ రంగంలో ఓ ప్రభంజనం. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను అందించి.. సక్సెస్ ఫుల్ అయిన చైనా కంపెనీ షియోమీ.. ప్రస్తుతం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. కేవలం రూపాయికే స్మార్ట్ ఫోన్ ను అందించనుంది. ఈనెల 4 నుంచి 6 వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తోంది. ఆ సేల్ లో భాగంగా… రూపాయికే షియోమీ స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీలు, టీవీలను అందిస్తోంది. వాటితో పాటు 2400 రూపాయల విలువైన ప్రాడక్ట్స్ ను కేవలం 99 రూపాయలకే అందించనుంది.
రూపాయి సేల్ ను 4 నుంచి 6 వరకు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు. ఆ ఆఫర్ లో రెడ్ మీ నోట్ 7 ప్రో, పోకో ఎఫ్ 1, ఎంఐ సౌండ్ బార్, ఎంఐ ఎల్ఈడీ టీవీ లాంటి ప్రాడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ రూపాయికే అమ్ముతున్నారు. ఈనెల 4 న మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 12 గంటలకు సపరేట్ గా రెడ్ మీ నోట్ 7, రెడ్ మీ నోట్ 7 ప్రో, రెడ్ మీ గో ఫ్లోన్లను విక్రయిస్తారు.
మిగితా సేల్ లో రెడ్ మీ నోట్ కు చెందిన అన్ని వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. చార్జర్లు, ఎంఐ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్ లాంటి యాక్సెసరీస్ అన్నీ భారీ డిస్కౌంట్లలో లభించనున్నాయి. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి వస్తువులను కొన్న వారికి 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.