ప్రస్తుతం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీపై తెలుగు సహా భారత దేశం మొత్తంలో ఉన్న సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కుహున్న ఈ భారీ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీంగా, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో భారీ విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటి వాటితో పాటు పాటలు కూడా అదిరిపోతాయని టాక్.
మొత్తం ఐదు పాటలుండే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన జానపద గీతం ఉందట. ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా తమదైన డ్యాన్సింగ్ మూమెంట్స్ తో ఒకరినిమించేలా మరొకరు అదరగొట్టనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా తాజా షెడ్యూల్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సాంగ్ ని అతి త్వరలో ఒక ప్రత్యేకమైన సెట్ లో ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కించనున్నట్లు చెప్తున్నారు. రేపు సినిమా రిలీజ్ తరువాత ఈ సాంగ్ కు థియేటర్స్ లో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఈలలు గోలలతో అదరగొట్టడం ఖాయమని సమాచారం. వాస్తవానికి సినిమాలోని అతి తక్కువ సన్నివేశాల్లో మాత్రమే అల్లూరి, కొమరం భీం పాత్రలు కలిసి కనిపించడం జరుగుతుందని,
అయితే కనిపించే ఆ కొద్దిపాటి సీన్స్ ఆడియన్స్ లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయట. రాజమౌళి గత సినిమాల మాదిరిగానే ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాలో కూడా ఐదు పాటలకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని, తప్పకుండా ఈ సాంగ్స్ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతాయని టాక్. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్….!!