నన్ను నమ్ము, ఎప్పటికీ మరిచిపోలేని సర్‌ప్రైజ్.. రామ్ చరణ్‌పై ఎన్టీఆర్ ట్వీట్

-

రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 27) సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది, ఈ మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటో ఓ సారి చూద్దాం.

బ్రో.. రామ్ చరణ్.. మామూలుగా అయితే నీ పుట్టినరోజు వేడుకలను ఓ రేంజ్‌లో చేయాలి.. కానీ లాక్ డౌన్, కరోనా మహమ్మారి విజృంభించడంతో అది కుదురడం లేదు.. ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉండాలి. అందుకే నీ కోసం రేపు ఉదయం పది గంటలకు డిజిటల్ సర్‌ప్రైజ్ ఇస్తున్నా.. నన్ను నమ్ము.. అది అదిరిపోయేలా ఉంటుంది.. నువ్వెప్పటికీ మరిచిపోలేవు.. రామరాజు కోసం భీమ్ అంటూ ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్ ట్వీట్‌కు రామ్ చరణ్ స్పందిస్తూ.. అవునా.. అయితే నేను సరైన సమయానికే ట్విట్టర్ ప్రపంచంలోకి వచ్చాను..లేదంటూ నీ సర్‌ప్రైజ్‌ను మిస్ అయ్యేవాడిని..రేపటి వరకు ఆగలేకపోతోన్నా.. అని ట్వీట్ చేశాడు. ఇక రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కోసం మెగా ఫ్యాన్స్ అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మోషన్ పోస్టరే ఇప్పటి వరకు దుమ్ములేపుతుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news