ఒకసారి జరిగిన పరాభవం సరిపోలేదా ..మళ్ళీ ఎందుకిప్పుడు ..?

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ .. టాలీవుడ్ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని స్థానాన్ని సంపాదించుకున్నారు. స్వయంవరం సినిమాతో రచయుతగా ప్రయాణం మొదలు పెట్టిన త్రివిక్రమ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి రచయితగా పని చేశారు. ఆ తర్వాత తరుణ్ శ్రియ జంటగా నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన అతడు సినిమా త్రివిక్రమ్ కి దర్శకుడిగా టర్నింగ్ పాయింట్ అన్న సంగతి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఎన్.టి.ఆర్ ల తో బ్లాక్ బస్టర్స్ తీశారు త్రివిక్రమ్.

 

అయితే కథ-కథనం- మాటలు- దర్శకత్వం ..వీటన్నిటిలో సక్సస్ అయ్యారు. అయితే త్రివిక్రమ్ కి ఆయన జీవితంలో ఏదీ వెలితి ఉంది. అందుకే నిర్మాతగాను మారారు. కానీ నిర్మాతగా మాత్రం సక్సస్ కాలేదు. అయిన మరో సారి నిర్మాతగా సినిమాలో భాగస్వామిగా చేరి గట్టి సక్సస్ ని అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తాజా సమాచారం. అందుకు తగ్గ ప్రణాళికలు పకడ్బంధీగా చేసుకుంటున్నారట. అది కూడా ఒక స్టార్ హీరో తో తెరకెక్కించబోయో సినిమా తో స్క్రీన్ మీద ప్రొడ్యూసర్ అన్న పేరుని చూసుకోవాలని ఆశిస్తున్నారట.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ హీరో నితిన్ తో కలిసి ‘చల్ మోహన రంగా’ సినిమాని నిర్మించి దెబ్బ తిన్నారు త్రివిక్రమ్. కానీ ఈసారి మాత్రం అలా దెబ్బ పడకూడదనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ తో బన్నీతో నిర్మాతగా సినిమా తీయాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం సుకుమార్ తో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కంప్లీటవగానే మరోసారి గీతా ఆర్ట్స్ – హారిక అండ్ హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈసారి నిర్మాతగా కూడా మంచి హిట్ ని అందుకోవాలని కసిగా ఉన్నారు.

గురూజీ ఈసారి ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చి బన్నీ లాంటి స్టార్ హీరోతో నిర్మాతగా తొలి హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే గతంలో చల్ మోహనరంగ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి సినిమా మాత్రం తేడా కొట్టింది. దాంతో నిర్మాతగా బ్యాక్ ఎండ్ లో ఉన్నప్పటికి లాస్ అయ్యారు త్రివిక్రమ్. అందుకే ఈసారు స్టార్ హీరో తో సినిమాకి నిర్మాతగా ఉండి సేఫ్ లో సక్సస్ అందుకుందామనా అంటూ అంటూ త్రివిక్రమ్ మీదే కొందరు పంచ్ లు వేస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఉన్న చోట కుదురుగా సినిమా డైరెక్ట్ చేసుకోక ఇలా నిర్మాతగా చేతులు కాల్చుకొని చేదు అనిభవాలని ఎందుకు నిత్తిమీద వేసుకుంటారో ఆయనకే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version