మ‌రోసారి వివాదంలో చిక్కుకున్న బాల‌య్య‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ఏఆర్ రెహ‌మాన్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న ఏది మాట్లాడినా దాదాపు దానిపై ట్రోలింగ్ న‌డ‌వ‌డం ఈ మ‌ధ్య కామ‌న్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నబాల‌య్య‌ (balayya)  మ‌రోసారి సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. అయితే ఇలాంటి వివాదాస్ప‌ద కామెంట్లు చేయ‌డం ఆయ‌న‌కు కొత్తేమీ కాక‌పోయినా ఈసారి అన్ని భాష‌ల్లోనూ ఆయ‌న‌పై ట్రోలింగ్ న‌డుస్తోంది.

బాల‌య్య‌ /balayya)

ఇండియ‌న్ దిగ్గ‌జ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అలాగే ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహమాన్ గురించి ప్ర‌స్తావ‌న రాగా ఆయ‌న ఎవరో తనకు తెలియదని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. అంతే కాదు రీసెంట్‌గా ఎన్టీ రామారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే డిమాండ్ వ‌స్తున్న నేప‌థ్యంలో త‌దీనిపై కూడా చాలా వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు ఆయ‌న‌.

భారతరత్న అవార్డు అనేది ఎన్టీ రామారావు కాలి గోరుకు సమానమని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇక ఏఆర్ రెహ‌మాన్ ఏడాదికి ఒక్క హిట్ మాత్ర‌మే ఇస్తాడ‌ని చెప్ప‌డం ఇప్పుడు ఏఆర్ రెహ‌మాన్ అభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. దీంతో వారంతా ట్విట్ట‌ర్ వేదిక‌గా బాల‌య్య ఇలా ఎలా మాట్లాడుతారంటూ ట్రోలింగ్ మొద‌లు పెట్టారు. త‌న లాంటి వ్య‌క్తి ఇలా మాట్లాడ‌టం భావ్యం కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.