ఓర్మాక్స్ మీడియా స‌ర్వేః మ‌హేశ్‌బాబుకు నెంబ‌ర్‌1 ప్లేస్‌.. త‌ర్వాత ఎవ‌రంటే..?

సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక స‌ర్వే జ‌ర‌గ‌డం అందులో హీరోల‌కు లేదా హీరోయిన్ల‌కు ఏదో ఒక రికార్డు ద‌క్క‌డం లాంటివి చూస్తూనే ఉంటాం. ఇక రీసెంట్‌గా టైమ్స్ సంస్థ ఉత్తమ సెలబ్రిటీ జాబితాలు రిలీజ్ చేయ‌గా అది పెద్ద చ‌ర్చ‌నీయంశ‌మైంది. ఇక ఇదే దారిలో ఇప్పుడు ముంబైకి చెందిన ప్ర‌ఖ్యాతి గాంచిన ఓర్మాక్స్ మీడియా సంస్థ అత్యంత ప్రజాదరణ క‌లిగిన టాలీవుడ్ స్టార్స్ హీరోల లిస్టును ప్ర‌క‌టించింది.ఇక ఈ లిస్టులో సూప‌ర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) మొద‌టి స్థానంలో నిలివ‌డంతో ఆయ‌న ఫ్యాన్ష్ పండ‌గ చేసుకుంటున్నారు. ఇక మ‌హేశ్ తర్వాతి స్థానాల్లో అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ లు వ‌రుస‌గా ఉన్నారు. ఇక్క‌డ విష‌యం ఏంటంటే మ‌హేశ్ బాబు ఎలాంటి ప్యాన్ ఇండియా మూవీ చేయకపోయినా కూడా నెంబ‌ర్ 1 ప్లేస్‌లో ఎలా నిలిచారో అర్థం కావ‌ట్లేద‌ని అంతా అంటున్నారు.

mahesh babu gave life to a child suffering from a chronic disease

ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్ పుష్ప లాంటి భారీ ప్యాన్ ఇండియా మూవీతో ఇండియాలో హాట్ టాపిక్‌గా ఉంటే ఆయ‌న రెండో ప్లేస్‌లో ఉండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇక నేష‌న‌ల్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు వ‌రుస‌గా ప్యాన్ ఇండియా మూవీలు చేస్తున్నా కూడా ఆయ‌న మూడో ప్లేస్‌కు ఉన్నారు.

ఇక ప్ర‌పంచం మొత్తం ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమాలో చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక సౌత్‌లోనే అత్యంత క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నాని, మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ లు ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉండ‌టంతో నెటిజ‌న్లు కూడా ఆశ్య‌ర్య‌పోతున్నారు. అస‌లు ఇది క‌రెక్టేనా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.