ROAR OF RRR -మెగా నంద‌మూరి ఫ్యాన్స్‌కి పండ‌గే

-

ROAR OF RRR అంటూ విడుద‌ల చేసిన వీడియో న‌భూతో న భ‌విష్య‌తి అన్న రీతిలో ఉంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి ఉన్న షూట్ చేసిన సీన్లను చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా విడుద‌ల‌వుతుందా అనిపిస్తుంది. మీరు ఓ లుక్కేయండి..

ధ‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మెగా నంద‌మూరి హీరోల‌తో చేస్తున్న RRR మూవీ అతి త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. బాహుబలితో రేంజ్‌ పెంచుకున్న రాజమౌళి RRRతో హాలీవుడ్‌పై కన్నేశాడు. సౌత్‌ ఇండియా నటీనటులతో బాహుబలి తీస్తే.. ఇండియావైడ్‌ సూపర్‌హిట్‌ అయింది. జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను పాన్‌ ఇండియా మూవీగా భావించడంలేదు. పాన్‌ ఇంటర్నేషనల్‌గా చూస్తున్నాడు.

సినిమాకు కొబ్బ‌రి కాయ కొట్టింది మొద‌లు అన్నీ స‌స్పెన్స్‌లే.. టైటిల్ ఆర్ అంటే ఎంటొ అనే ఉత్సుక‌త‌ను ప్రేక్ష‌ల్లో పెంచేశాడు రాజ‌మౌళి. మొత్తానికి అంటే రౌద్రం రణం రుధిరం అంటూ అంచ‌నాల‌ను ఇంకా పెంచేశాడు. సినిమా ప్ర‌మోష‌న్ తీయ్య‌డంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడో, ఆ సినిమాని ప్ర‌మోట్ చెయ్యడంలో అంతకంటే ఎక్కువ శ్ర‌ద్ధ చూపిస్తాడు. బాహుబ‌లి విష‌యంలో రాజ‌మౌళి చేసిన ప్ర‌మోష‌నే స‌క్సెస్ కావ‌డానికి తొలి అడుగు అనటంలో సందేహం లేదు. బాలీవుడ్ నిర్మాత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. మ‌రి ఆర్ార్ విష‌యంలో ఇంకా అంటూ విడుద‌ల చేసిన వీడియోతో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టాలెక్కించాడు.

RRR లో ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా క‌నువిందు చేయ‌నున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ రామ్ చరణ్ కు జోడిగా సీతగా కనిపిస్తుంది. ఇక తారక్ కు జోడీగా హాలీవుడ్ భామ‌ ఒలీవియా జెన్నీఫర్ నటిస్తుంది.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. అంతే కాకుండా హాలీవుడ్ నటులైన రే స్టీవెన్ సన్ స్కాట్ గా కనిపించనున్నాడు. మరో హాలీవుడ్ అందగత్తె అలీసన్ డూడీ ఇతడికి జోడీగా నటిస్తుంది. వీళ్లు మాత్రమే కాకుండా మనకు తెలిసిన చాలా మంది నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. వారిలో అందాల ముద్దుగుమ్మ శ్రియ, కమెడియన్ రాహుల్ రామకృష్ణ, సముద్రఖని, పోసాని కృష్ణ మురళి, చత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, టర్కీష్, ఇంగ్లీష్, జపనీస్,చైనీస్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ స్పానిష్,  భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news