నరేష్‌ భార్య రమ్యపై పోలీస్‌ కేసు వేసిన పవిత్ర

తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్య కథనాలు వెలువరించిన యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ల లింకులను కూడా ఆమె పోలీసులకు అందించారు. పవిత్ర నుంచి ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆదివారం 15 యూట్యూబ్ ఛానల్ కు నోటీసులు జారీ చేశారు.

ఇది ఇలా ఉండగా, తాజాగా నరేష్‌ భార్య రమ్యరఘుపతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి పవిత్ర. రమ్మ, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయని.. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు అడ్డంపెట్టుకొని నన్ను కించపరుస్తున్నారని.. ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు పవిత్ర.