తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో సంప్రదాయ బద్ధమైన పాత్రలు పోషించిన నటి పవిత్ర లోకేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హోమ్లీ రోల్స్ ప్లే చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ అమ్మ, తల్లి పాత్రలు పోషించి చక్కటి రికగ్నిషన్ తెచ్చుకుంది.
నటి పవిత్ర లోకేశ్ తాజాగా మరో అవతారం ఎత్తారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిపోయారు. అవునండీ..మీరు చదివింది నిజమే.. పవిత్ర లోకేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో పాటు మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది.
టాలీవుడ్ సీనియర్ హీరో వీకే నరేశ్ హీరోగా రాబోతున్న ఈ సినిమా ఏపీలోని రాజమహేంద్రవరం మహా కాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఉండబోతున్నారు. ఇందులో వీకే నరేష్ తో పాటు పవిత్రా లోకేశ్, దేవాలయ ధర్మకర్త పట్టపాగులవెంకట్రావు, ఎం.సి. వాసు నటిస్తున్నారు. కాగా, నటి పవిత్ర లోకేష్ ఇందులో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
వీకే నరేష్ సమర్పణలో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ పిక్చర్ తెరకెక్కుతోంది. మూవీ ఫస్ట్ లుక్ ను కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి రిలీజ్ చేశారు. చూడాలి మరి నటి పవిత్ర లోకేశ్..దర్శకురాలిగా ఫిల్మ్ ఎలా తీస్తారో..అది ఏ మేరకు విజయం సాధిస్తుందో..