పవన్‌కళ్యాణ్‌,ఆనందసాయి కాంబో పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ

Join Our Community
follow manalokam on social media

పవన్‌కళ్యాణ్ కు త్రివిక్రమ్‌ ఎలాగో.. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయితో కూడా మంచి ఫ్రెండ్‌షిప్‌ వుంది. ఈ ఇద్దరి స్నేహం ఇవాల్టిది కాదు. కష్టమొచ్చినా.. ఆనందం వచచినా… ఒకరినొకరు పంచుకునేవారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సూపర్‌హిట్స్‌ వచ్చాయి. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత పవన్‌ సినిమాకు సెట్స్‌ వేస్తున్నాడు ఆనందసాయి.

బెస్ట్‌ ఫ్రెండ్ కావడంతో.. ఆనంద్‌సాయికి వరుస ఛాన్సులిచ్చాడు పవన్‌. తొలిప్రేమ, ఖుషి, జల్సా.. తమ్ముడుకు కళా దర్శకుడిగా ఆనంద్‌ సాయి పని చేశారు. తొలిప్రేమలో పవన్‌ చెల్లెలుగా నటించిన వాసూకీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆనంద్‌ సాయి. తొలిప్రేమ చిత్రం మొదలుకుని రామ్ చరణ్ ఎవడు వరకు షుమారు 50 సినిమాలకు కళా దర్శకత్వం వహించారు. సినిమాలకు దూరమైన ఆనంద్‌ సాయి గత ఐదేళ్లుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు రావడంతో… పవన్‌, హరీష్‌ శంకర్‌ మూవీకి సైన్‌ చేశారు.

పవన్‌, హరీష్ శంకర్‌ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత కళా దర్శకుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మూవీ స్నేహితుడు పవన్‌ కల్యాణ్‌దే కావడం విశేషం. తొలిప్రేమ సినిమాలో సముద్రం ఒడ్డున వేసిన తాజ్‌మహల్‌ సెట్‌ ఆనంద్‌సాయికి పేరు తీసుకొచ్చింది. ఖుషీ.. జల్సాలో వేసిన హౌస్‌ సెట్స్‌..రిచ్‌ లుక్‌తో ఆకట్టుకున్నాయి. హరీష్ శంకర్‌ మూవీలో కథకు సంబంధించి ఎలాంటి డిజైన్స్‌ వేసి ఇంప్రెస్‌ చేస్తారో చూడాలి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...