టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నపవన్ కళ్యాణ్ కుమారుడు

ప్రముఖ తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న కుమారుడు అకీరా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఖ‌రారు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశాడు.

ఇక ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ.. డబ్బింగ్ సినిమాతో కాకుండా, డైరెక్ట్ మూవీతో తన కుమారుడిని లాంచ్ చేయాలని పవన్ భావిస్తున్నారట. ఈ క్ర‌మంలోనే తన అన్నయ్య రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ లోనే ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తోంది.