మేనల్లుడికి పవన్ స్పెషల్ గ్రీటింగ్స్.. ఎలా చెప్పాడో తెలుసా..!

197

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయి తేజ్ కు ఫైనల్ గా చిత్రలహరి రూపంలో ఓ హిట్టు దక్కింది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రలహరి సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

ఏప్రిల్ 12న రిలీజైన ఈ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాతో విజయాన్ని అందుకున్న మేనళ్లుడికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి తన స్పెషల్ గ్రీటింగ్స్ అందించారు. ఇక లేటెస్ట్ గా మేనళ్లుడి సినిమా సక్సెస్ అయినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిత్ర నిర్మాతలకు, హీరో సాయి తేజ్ కు స్పెషల్ బొకే అందించారు.

అప్రిసియేషన్ ఫర్ చిత్రలహరి ఫ్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారు.. అంటూ పవన్ పంపించిన బొకేలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ టీం. పవన్ బొకెల మీద డియర్ సర్ అభినందనలు.. మీ సినిమాను ఎంతో ఆస్వాదించానని మెసేజ్ పెట్టడం జరిగింది.