పరశురాం డైరక్షన్ లో మహేష్..?

242

గీతా గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టాక డైరక్టర్ పరశురాం వెంటనే మరో సినిమా చేసే అవకాశం ఉన్నా చేస్తే గీస్తే గీతా ఆర్ట్స్ లోనే చేయాలనే కాన్సెప్ట్ తో వెయిట్ చేస్తూ వస్తున్నాడు. ఇక తన దగ్గర ఉన్న కథతో అల్లు అర్జున్, సాయి తేజ్ ఇలా ఒకరిద్దరు హీరోలకు సూటయ్యే వర్షన్ రెడీ చేసినా మెప్పించలేదని తెలుస్తుంది. అందుకే అది పక్కన పెట్టేసి సూపర్ స్టార్ మహేష్ కు కథ సిద్ధం చేస్తున్నాడట పరశురాం.

మహేష్ ను హ్యాండిల్ చేసే స్టామినా పరశురాం కు ఉందా అంటే.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ ఓ సినిమా కమిట్మెంట్ ఉంది. ఆ సినిమాను పరశురాం డైరక్షన్ లో చేయించాలని వారి ఆలోచన. అందుకే మహేష్ ను మెప్పించే కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట పరశురాం. మహర్షి తర్వాత మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అది పూర్తయ్యాక సందీప్ వంగతో ఉంటుందని టాక్. ఒకవేళ అప్పుడే పరశురాం కథ నచ్చితే అతనితో చేసే అవకాశం ఉంటుంది.