Pawan Kalyan: అభిమానితో పవన్ కల్యాణ్ పోటీ..‘సంక్రాంతి’ బరిలో ‘హరిహర వీరమల్లు’?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా చిత్ర సీమకు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపున రాజకీయాలు చేస్తూనే మరో వైపున సినిమాలూ చేస్తున్నారు. ఇటీవల జనసేనాని నటించిన ‘భీమ్లా నాయక్’ విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.

పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ పిక్చర్ లో యాక్షన్ సీక్వెన్సెస నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ పైన మళ్లీ కసరత్తులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ చేస్తు్న్న తొలి పాన్ ఇండియా చిత్రం అయిన ‘హరిహర వీరమల్లు’పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్న మేకర్స్ తాజాగా ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అదే జరిగితే పవన్ కల్యాణ్..తన అభిమాని అయిన తలపతి విజయ్ 66వ సినిమాతో పోటీ పడుతారని అంటున్నారు సినీ పరిశీలకులు. ‘తలపతి 66’ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. చూడాలి మరి…ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news