అనురాగ్ క‌శ్య‌ప్ బండారం బ‌య‌టపెట్టింది!

-

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతి బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తోంది. మీటూ ఉద్య‌మం స‌మ‌యంలోనూ బ‌య‌టికి రాని సంచ‌ల‌న విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తున్నాయి. సుశాంత్ మ‌ర‌ణానికి బాలీవుడ్‌లో వున్న నెపోటిజ‌మ్‌తో పాటు డ్ర‌గ్స్ కూడా ఓ కార‌ణంగా మారాయంటూ పలువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు బాహాటంటానే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ హీరోయిన్ Aచేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

ఇటీవ‌ల ఓ ద‌ర్శ‌కుడు త‌న‌ని ప‌డ‌క‌గ‌దికి రావాల‌ని ఫోర్స్ చేశాడంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించిన పాయ‌ల్ ఘోష్ తాజాగా ఆ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ అని ప్ర‌క‌టించి షాకిచ్చింది. అత‌నిలో క్రియేట‌ర్ కంటే రాక్ష‌సుడే ఎక్కువగా వున్నాడ‌ని, అవ‌కాశాల కోసం తాను ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో త‌న‌ని గ‌దిలోకి తీసుకెళ్లి అస‌భ్యంగా తాకాడ‌ని, బ‌ల‌వంతం కూడా చేయ‌బోయాడ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాలంటూ ఏకంగా దేశ ప్ర‌ధాని మోదీకి ట్వీట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అనురాగ్ క‌శ్య‌ప్‌లోని రాక్ష‌సుడిని ప్ర‌జ‌ల‌కు చూపించండి. అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోండి. ఇలా చెప్ప‌డం వ‌ల్ల నాకు ప్ర‌మాదం అని తెలుసు. సాయం చేయండి అని పాయ‌ల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ధానిని అభ్య‌ర్థించింది. దీనిపై జాతీయ మహిళా క‌మీష‌న్ చైర‌ప‌ర్స‌న్ రేఖాశ‌ర్మ స్పందించారు. పూర్తి వివ‌రాల‌తో ఫిర్యాదు చేస్తే తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ట్వీట్ చేశారు. త్వ‌ర‌లో ఫిర్యాదు చేస్తాన‌ని పాయ‌ల్ ఘోష్ వివ‌ర‌ణ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news