నన్ను హింసించకండీ… ప్లీజ్..! ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పాయల్ ఘోష్ విన్నపం..!

payal ghosh urges ntr fans to not comment on her
payal ghosh urges ntr fans to not comment on her

అకారణంగా ఎన్టీఆర్ ను వెనుకేసుకొస్తుంది నటి పాయల్ ఘోష్. ఎన్టీఆర్ పై జాలి పడండి, గర్వించండి అంటూ ట్వీట్ లు చేస్తుంది. మరీ ఎన్టీఆర్ అభిమానులు ఊరుకుంటారా..? ఆమె పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు మరి కొందరు ఆమెకు నేరుగా మెసేజెస్ కూడా చేస్తున్నారట. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చింది పాయల్. ఎన్టీఆర్ మంచి సినిమా కుటుంబం నుండి వచ్చారని కానీ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాడానికి ఎంతో కష్టపడ్డారని ఆమె పేర్కొంది. ఎన్టీఆర్ గతం గురించి తెలుసుకున్న తాను ఏడ్చేశానని ఆమె ఆనింది. ఎన్టీఆర్ పై జాలి చూపండి ఎన్టీఆర్ కు గౌరవం ఇవ్వండి అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ ను తాను ఎందుకు వెనకేసుకొస్తుందో అది ఎవ్వరికీ అర్థం అవ్వదని తనని అందరూ అనవసరంగా దూశిస్తున్నారని ఆమె తన ట్వీట్టర్ వేధిక లో ట్వీట్ చేసింది. మరో ట్వీట్ లో నేను డిప్రెషన్ పేషంట్ ను నన్ను దయచేసి హింసించకండి మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను అంటూ ట్వీట్ చేసింది